Blood Sugar: వీటి వల్ల.. పది రెట్లు అధికంగా రక్తంలోకి గ్లూకోజ్

  • ఆర్టిఫీషియల్ స్వీట్ నర్లు వద్దు
  • తగినంత నిద్ర లేకపోతే రిస్క్
  • డీహైడ్రేషన్ లేకుండా చూసుకోవాలి
  • వ్యాయామం తప్పనిసరి
  • ఆహారంలో పీచు ఉంటేనే మంచిది
10 Times Blood Sugar Builds Up Surreptitiously with un health habbits

దిన చర్య, ఆహార అలవాట్లు చాలా వరకు మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంటాయి. అయితే, చాలామంది వీటిపై పెద్దగా శ్రద్ధ చూపించరు. ముఖ్యంగా మధుమేహం వచ్చిన వారు తమ ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ, అవగాహనతో ఉండాలి. ఏవి తీసుకోకూడదు, ఏవి తీసుకోవాలన్నది తప్పక తెలుసుకోవాలి. దీని ద్వారా మధుమేహాన్ని సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు. 

కృత్రిమ తీపి పదార్థాలు
మధుమేహానికి చక్కెరను మానివేయడమే పరిష్కారమని చాలా మంది అనుకుంటూ ఉంటారు. చక్కెరకు బదులు ప్రత్యామ్నాయమైన కృత్రిమ తీపి పదార్థాలను ఉపయోగిస్తుంటారు. కానీ, చాలా వరకు కృత్రిమ స్వీట్ నర్లు సైతం రక్తంలో గ్లూకోజ్ ను పెంచుతాయి. వీటికి బదులు మామూలు పంచదారనే తక్కువగా ఉపయోగించుకోవడం నయం.

నిద్ర
పని ఒత్తిడి, ఆలోచనలు ఇలా ఎన్నో కారణాలతో నిద్ర తక్కువగా పోయే వారికి మధుమేహం రిస్క్ ఉంటుంది. సరైన నిద్ర లేకపోవడం వల్ల ఇన్సులిన్ ను సమర్థవంతంగా శరీరం ఉపయోగించుకోలేదు. దీంతో సాధరణ మధుమేహం ఛాయలు కనిపించకుండా పోతాయి.

బ్రేక్ ఫాస్ట్ మానివేయడం
రాత్రి చాలా ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం చాలా ఆలస్యంగా లేవడం వల్ల కొంత మంది బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ కొడుతుంటారు. ఉదయం నుంచి ఏమీ తినకుండా, మధ్యాహ్నం భోజనం చేయడం వల్ల రక్తంలో గ్లూకోజ్ పెరిగిపోతుంది. రాత్రి భోజనంతోనూ ఇదే జరుగుతుంది.

డీహైడ్రేషన్
చాలా మందికి తెలియని విషయం ఇది. శరీరంలో నీటి పరిమాణం తగ్గడం వల్ల అదనంగా ఉన్న బ్లడ్ షుగర్ ను బయటకు పంపలేదు. దీంతో తక్కువ నీరు తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ రిస్క్ ఉంటుంది.

వ్యాయామం
భౌతిక వ్యాయామాలు ఎంత అవసరం అన్నది చెప్పక్కర్లేదు. రోజూ 30-45 నిమిషాల వరకు వ్యాయామం చేయాలి. వారంలో 150 నిమిషాలు ఉండాలని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ సైతం సిఫారసు చేసింది. 

పీచు తగినంత లేకపోవడం
ఫ్యాట్, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహారం స్థూలకాయానికి దారితీస్తుంది. పీచు అధికంగా ఉన్న కూరగాయలు.. క్యారట్, గింజలు, నట్స్, ముడి ధాన్యాలు, పండ్లు టైప్-2 డయాబెటిస్ నుంచి రక్షణ నిస్తాయి.

పొగ తాగడం ఆల్కహాల్
పొగతాగడం, మద్యపాన సేవనం కూడా మధుమేహానికి కారణమవుతాయి. రక్తంలో షుగర్ స్థాయులు పెరిగిపోతాయి. వీటికి దూరంగా ఉండాలి.

మోతాదులో మందులు
సరైన మోతాదులో మందు వేయకపోతే రక్తంలో షుగర్ స్థాయులు పెరిగిపోతాయి. దీనివల్ల ప్రస్తుతం తీసుకుంటున్న మందులతో పాటు, ఇతరత్రా మందులు కూడా తీసుకోవాల్సి వస్తుంది. 

హార్మోన్లలో మార్పులు
హార్మోన్లలో మార్పులతోనూ మధుమేహం రిస్క్ పెరుగుతుందని పలు అధ్యయనాలు తేల్చాయి. మహిళల్లో నెలసరి కూడా మధుమేహాన్ని పెంచుతుంది. ఈస్ట్రోజెన్ హార్మోన్ ఇన్సులిన్ సెన్సిటివ్ ను ప్రభావితం చేస్తుంది.

More Telugu News