సర్వనాశనం.. బూడిదకుప్పగా మారిన ఉక్రెయిన్ సిటీ!
- డొనెట్స్క్ నగరం డ్రోన్ ఫొటోలు విడుదల చేసిన ఉక్రెయిన్
- రష్యా దాడిలో సిటీ మొత్తం నాశనమైందని ఆవేదన
- మారింకా సిటీ 4 నెలలపాటు రష్యన్ల చెరలో ఉందని వెల్లడి
ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ఈ ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేసింది. సిటీలోని ఇళ్లు, ఇతర కట్టడాలు మొత్తం నేలమట్టమైన దృశ్యాలు ఆ ఫొటోలలో కనిపిస్తున్నాయి. యుద్ధానికి ముందు మారింకా చాలా ప్రశాంతంగా ఉండేదని, పదివేల మందికి పైగా జనాభా నివసించేవారని పేర్కొంది. రష్యాకు చెందిన యుద్ధ నేరస్థులు మారింకాలో దేనినీ వదిలిపెట్టలేదని, అన్నింటినీ ధ్వంసం చేసి వెళ్లారని తెలిపింది. యుద్ధం మొదలైన తర్వాత రష్యా ఆక్రమించిన ఉక్రెయిన్ భాగాలలో మారింకా కూడా ఉంది. నాలుగు నెలల పాటు రష్యా అధీనంలో ఉన్న ఈ సిటీలో చెట్టూచేమా, ఇళ్లూ వాకిళ్లూ.. ఇలా అన్నింటినీ ధ్వంసం చేశారు.