Nithyananda: ఇవి కూడా నిత్యానంద ‘కైలాస’ మాదిరి దేశాలే!

From Republica Glaciar to Sealand list of self proclaimed nations like Nithyanandas Kailasa
  • రాజకీయ, ఆధ్యాత్మిక భావనతో ఏర్పడినవే ఈ దేేశాలు
  • జనాభా అతి తక్కువ
  • ప్రత్యేక దేశంగా గుర్తించని ఐక్యరాజ్యసమితి

అత్యాచారం ఆరోపణలను ఎదుర్కొంటూ దేశం విడిచి వెళ్లి ఓ చిన్న దీవి కొనుక్కుని దానికి ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస’ అని నామకరణం చేసి, స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు నిత్యానంద. ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం కోసం ఇటీవల ఆయన ప్రతినిధులు ప్రయత్నించడం చూశాం. జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశాలకు శ్రీకైలాస దేశ ప్రతినిధులు ఇద్దరు హాజరయ్యారు. అయినా, నిత్యానంద దీవిని ఒక దేశంగా ఐక్యరాజ్యసమితి గుర్తించలేదు. శ్రీకైలాస మాదిరే రాజకీయ, ఆధ్యాత్మిక ఆశయాలతో ఏర్పడిన బుల్లి దేశాలు మరికొన్ని ఉన్నాయి.

రిపబ్లిక్ ఆఫ్ మొలాసియా
కెవిన్ బాగ్ అనే వ్యక్తి రిపబ్లిక్ ఆఫ్ మొలాసియా పేరుతో దేశాన్ని ప్రకటించుకున్నారు. అమెరికాలోని నెవడాకు సమీపంలో ఇది ఉంటుంది. ఇక్కడి జనాభా 34 మంది. 4 కుక్కలు. సొంత కరెన్సీ వలోరా అని కూడా ఉంది. 2.28 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ కుక్కలకు కూడా పౌరసత్వం ఇస్తారు. బాగ్, అతని భార్య, ముగ్గురు పిల్లలు కూడా ఇక్కడి జనాభాలో భాగం. బాగ్ ఎప్పుడూ మిలటరీ డ్రెస్ లోనే కనిపిస్తారు. లోగడ తూర్పు జర్మనీ, మరో బుల్లి దేశం ముస్టా చెస్టాన్ తో ఇది యుద్ధానికి కూడా దిగింది. పర్యాటకులను సాదరంగా బాగ్ ఆహ్వానిస్తుంటారు. 

ఫ్రీ రిపబ్లిక్ ఆఫ్ లిబర్ ల్యాండ్
బిట్ జెడ్లికా 2015 ఏప్రిల్ 13న ‘లిబర్ ల్యాండ్’పేరుతో స్వతంత్ర దేశంగా ప్రకటించారు. క్రొయేషియా, సెర్బియా మధ్య చిన్న పరిమాణంలో ఉంటుంది ఈ దేశం. దనుబే నదీ తీరంలో ఉంటుంది. ఇక్కడి జనాభా 2.5 లక్షలు. 

 సీల్యాండ్
హెచ్ఎం ఫోర్ట్ రఫ్స్ అనే వ్యక్తి ‘సీల్యాండ్’ పేరుతో ప్రత్యేక దేశాన్ని ప్రకటించుకున్నారు. ఉత్తర సముద్రంలో ఇంగ్లండ్ తీరంలో ఉంది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేశారు. 1966లో బ్రిటిష్ నేవీ ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఆ తర్వాత దీన్ని ప్రత్యేక దేశంగా ఫోర్ట్ రఫ్స్ ప్రకటించారు. ఇక్కడి జనాభా 27 మంది.

రపబ్లికా గ్లేసియర్
గ్రీన్ పీస్ ఎన్విరాన్ మెంట్ కార్యకర్తలు ‘రిపబ్లిక్ గ్లేసియర్’పేరుతో ప్రత్యేక దేశాన్ని ప్రకటించుకున్నారు. చిలే, అర్జెంటీనా మధ్య ఖాళీ స్థలం ఉంటుంది. నీటి నిల్వలను కాపాడేందుకు ఏర్పాటైన దేశం ఇది. రెండు దేశాల మధ్యనున్న ఈ ప్రాంతంలో కార్యకర్తలు చురుగ్గా పనిచేస్తుంటారు. రెండు దేశాల సరిహద్దు ప్రాంతం కావడం, చట్టపరమైన లొలుసుగులతో ఉన్నందున దీనిపై హక్కుల కోసం ఎవరూ క్లెయిమ్ చేయరని భావిస్తుంటారు.  ఈ దేశ జనాభా లక్ష మంది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేయడం ద్వారా ఈ దేశ పౌరసత్వాన్ని పొందొచ్చు. 

పాంటిన్హా
2000లో స్కూల్ రెనాటో డీ బారోస్ అనే టీచర్ దీన్ని కొనుగోలు చేశారు. ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్నారు. బారోస్ తర్వాత తనను యువరాజుగా పేర్కొన్నారు. ప్రస్తుతం నలుగురే ఈ దేశంలో నివసిస్తున్నారు.

  • Loading...

More Telugu News