ఉమాశంకర్‌రెడ్డి భార్య స్వాతి హత్యకు యత్నం.. నిందితులకు 14 రోజుల రిమాండ్
- వివేకా హత్య కేసులో ఉమాశంకర్‌రెడ్డిపై ఆరోపణలు
- స్వాతి ఇంట్లోకి ప్రవేశించి గొంతు నులిమి దాడి
- వివేకా హత్యను జీర్ణించుకోలేక దాడి చేశామని అంగీకరించిన నిందితులు
వివేకాను చంపేసి ప్రశాంతంగా కూర్చున్నారా? అంటూ తన గొంతు నులిమి చెప్పుతో కొట్టి చంపేందుకు ప్రయత్నించారని స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరమేశ్వరరెడ్డి, సునీల్ కుమార్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరాన్ని ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు.
వివేకా హత్యను జీర్ణించుకోలేకపోయామని, ఉమాశంకర్‌రెడ్డిపై ఏర్పడిన కోపంతోనే ఆయన భార్యపై దాడికి యత్నించినట్టు నిందితులు అంగీకరించారని పోలీసులు పేర్కొన్నారు. నిన్న వారికి జమ్మలమడుగు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించినట్టు చెప్పారు.