Ramcharan: భార్యతో కలిసి అమెరికాలో తెగ తిరిగేస్తున్న రామ్ చరణ్.. బేబీమూన్ ట్రిప్ వీడియో వైరల్

Mega Power Star Ram Charan Enjoying in America with wife Upasana
  • ఆస్కార్ వేడుకల కోసం అమెరికాలో రామ్‌చరణ్
  • షాపింగ్, సైట్ సీయింగ్‌తో చెర్రీ, ఉపాసన బిజీబిజీ
  • బేబీమూన్ ట్రిప్ వీడియోను షేర్ చేసిన ఉపాసన
ఆస్కార్ వేడుకల కోసం అమెరికాలో ఉన్న మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ అక్కడ తన భార్య ఉపాసనతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. అమెతో కలిసి అమెరికాను చుట్టేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన బేబీమూన్ ట్రిప్ వీడియోను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు. చరణ్ ఓపెన్ టాప్ కారును స్వయంగా డ్రైవ్ చేస్తూ కనిపించాడు. షాపింగ్, డిన్నర్, సైట్ సీయింగ్‌తో ఇద్దరూ బిజీగా, హ్యాపీగా గడిపేశారు. 

‘ట్రిపుల్ ఆర్’ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న చరణ్ కాస్తంత తీరిక సమయంలో భార్యను బయటకు తీసుకెళ్లి సర్‌ప్రైజ్ చేశాడు. ఇక, ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. 5 హాలీవుడ్ క్రిటిక్స్ చాయిస్ అవార్డులను గెలుచుకుంది. అలాగే, ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును సాధించింది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో సినిమాలోని ‘నాటునాటు’ పాట ఆస్కార్‌కు నామినేట్ అయింది. ఈ సాంగ్‌కు అవార్డు ఖాయమని చెబుతున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Ramcharan
Upasana
America
RRR
Oscar Awards

More Telugu News