Delhi Capitals: డబ్ల్యూపీఎల్ లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్ తో యూపీ వారియర్స్ ఢీ

Delhi Capitals takes on UP Warriarz in WPL
  • ఇటీవల ప్రారంభమైన మహిళల ప్రీమియర్ లీగ్
  • ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతున్న డబ్ల్యూపీఎల్
  • టోర్నీలో చెరొక మ్యాచ్ గెలిచిన ఢిల్లీ, యూపీ
  • నేటి మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న యూపీ
భారత్ లో ఐపీఎల్ తరహాలో మహిళా క్రికెటర్లతో నిర్వహిస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రసవత్తరంగా సాగుతోంది. డబ్ల్యూపీఎల్ లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు నవీ ముంబయిలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియం వేదికగా నిలుస్తోంది. ఈ పోరులో టాస్ గెలిచిన యూపీ వారియర్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. 

ఇరుజట్లలోనూ మ్యాచ్ విన్నర్లు ఉండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. టోర్నీలో ఇప్పటివరకు ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ చెరొక మ్యాచ్ గెలిచి ఊపుమీదున్నాయి.
Delhi Capitals
UP Warriarz
Toss
WPL

More Telugu News