Tollywood: బాలయ్య సినిమాలో విలన్ గా బాలీవుడ్ హీరోయిన్

Bollywood diva Nora fatehi to play villian role in Balakrishna movie
  • అనిల్ రావిపూడితో సినిమాకు ఓకే చెప్పిన బాలయ్య
  • విలన్ పాత్రలో నటించనున్న నోరా ఫతేహి
  • హీరోయిన్ గా నటిస్తున్న కాజల్ అగర్వాల్  
అఖండ, వీరసింహా రెడ్డి సినిమాలతో నందమూరి బాలకృష్ణ వరుస విజయాలు సొంతం చేసుకొని జోరు మీదున్నారు. ఇప్పుడు ఆయన అనిల్ రావిపూడితో సినిమాకు రెడీ అవుతున్నారు. కామెడీ, ఫ్యామిలీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనిల్ బాలయ్యతో తన మార్కు కామెడీకి తోడు మాస్ సినిమాను ప్లాన్ చేశాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో బాలయ్య తన వయసుకు తగ్గట్టుగా తండ్రి పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. యువ నటి శ్రీలీల ఆయన కూతురు పాత్రను పోషించనుంది. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్‌ అగర్వాల్‌ నటించనుంది. షైన్‌ స్క్రీన్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

ఇక ఈ చిత్రంలో విలన్ పాత్రకు ఎవ్వరూ ఊహించని విధంగా బాలీవుడ్ నటిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. చిత్రంలో బాలయ్యతో ఢీ కొట్టే విలన్‌గా బాలీవుడ్‌ భామ నోరా ఫతేహి నటిస్తున్నట్లు సమాచారం. గతంలో నోరా ‘బాహుబలి’ సినిమాలో ‘మనోహరి’ పాటలో నర్తించింది. అనిల్ చెప్పిన కథకు నోరా అంగీకరించినట్టు తెలుస్తోంది. నోరా పాత్ర నెగటివ్ షేడ్స్ తో కూడి పవర్ ఫుల్ గా ఉంటుందట. కాగా, ఈ చిత్రాన్ని త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లి దసరా కానుకగా విడుదల చేయాలని అనిల్ భావిస్తున్నాడు.
Tollywood
Bollywood
Balakrishna
nora fatehi
anil ravipudi

More Telugu News