sarpatta parampara: సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్.. ప్రకటించిన పా.రంజిత్!

sarpatta parampara sequel on cards
  • రెండేళ్ల కిందట ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సార్పట్ట పరంపర’
  • బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా.. సూపర్ హిట్
  • ‘సార్పట్ట పార్ట్ 2’ తీయబోతున్నట్లు ప్రకటించిన పా.రంజిత్ 
విభిన్న కథాంశాలతో సినిమాలు రూపొందిస్తుంటారు పా.రంజిత్. చిన్న హీరో అయినా.. సూపర్ స్టార్ అయినా.. ఆయన సినిమాలో కథే హీరో. రజనీకాంత్ లాంటి పెద్ద హీరోతో కబాలి, కాలా లాంటి సినిమాలు రూపొందించి ప్రేక్షకులను ఆయన ఆశ్చర్యపరిచారు. తాజాగా మరో సినిమాను రంజిత్ ప్రకటించారు. 

తొలిసారిగా తన సినిమాకు సీక్వెల్ చేస్తున్నట్లు పా.రంజిత్ ప్రకటించారు. రెండేళ్ల కిందట కరోనా సమయంలో నేరుగా ఓటీటీలో విడుదలై, సూపర్ హిట్ అయిన ‘సార్పట్ట పరంపర’కు సీక్వెల్ తీస్తున్నట్లు వెల్లడించారు. ‘సార్పర్ట రౌండ్ 2’ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ చిత్రాన్ని థియేటర్‌లోనే రిలీజ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘కతర్ బషా ఎంద్ర ముతురమలింగమ్‌’ అనే సినిమా చేస్తున్న ఆర్య.. అది పూర్తి కాగానే సార్పట్ట సీక్వెల్‌ను సెట్స్‌ పైకి తీసుకెళ్లనున్నారు. 

పా.రంజిత్ కూడా ప్రస్తుతం విక్రమ్‌ తో ‘తంగళన్‌’ సినిమా చేస్తున్నారు. 19వ శతాబ్దంలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. షూటింగ్‌ చివరిదశలో ఉన్న ఈ సినిమాను వేసవిలో ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.

ఆర్య ప్రధాన పాత్రలో నటించిన ‘సార్పట్ట పరంపర’ను పా.రంజిత్‌ తెరకెక్కించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలై సంచలనం సృష్టించింది. ప్రైమ్‌లో అత్యధిక వ్యూయర్‌షిప్‌ సాధించిన సినిమాగా అప్పట్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్, ఆర్య నటన, పా.రంజిత్‌ టేకింగ్‌ ప్రేక్షకులను కట్టిపడేశాయి.
sarpatta parampara
pa ranjith
sarpatta parampara sequel
arya

More Telugu News