sukesh: మై బేబీ గర్ల్, ఐ లవ్ యూ!.. జాక్వెలిన్ కు సుకేశ్ చంద్రశేఖర్ లేఖ

Conman Sukesh wishes Jacqueline Happy Holi from Tihar jail
  • మండోలా జైలు నుంచి లేఖ రాసిన సుకేశ్  
  • హోలీ శుభాకాంక్షలు చెబుతూ మీడియాకు విడుదల
  • కుటుంబంతో పాటు తనను ద్వేషించే వారికీ శుభాకాంక్షలు చెప్పిన సుకేశ్
హోలీ పండుగ సందర్భంగా బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు సుకేశ్ చంద్రశేఖర్ లెటర్ రాశాడు. ఈ రంగుల పండుగ నాడు ఆమె తన జీవితంలో కోల్పోయిన సంతోషాలన్నీ తిరిగి పొందాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు మీడియా మిత్రులు, తనను ద్వేషించే వాళ్లకూ సుకేశ్ హోలీ శుభాకాంక్షలు తెలిపాడు. 

ప్రముఖ బిజినెస్ మాన్ భార్యను మోసం చేసి రూ.200 కోట్లు కాజేసిన కేసులో సుకేశ్ ప్రస్తుతం మండోలా జైలులో ఉన్నాడు. ఈమేరకు సుకేశ్ రాసిన లేఖను ఆయన న్యాయవాది మీడియాకు విడుదల చేశారు. తనపై వచ్చిన ఆరోపణల విషయంలో తన వాదనను ప్రపంచానికి తెలియజేస్తున్న మీడియా మిత్రులకు సుకేశ్ తన లేఖలో ధన్యవాదాలు తెలిపాడు.

లేఖలో ఏముందంటే..
‘మై బేబీ గర్ల్.. ఐ లవ్ యూ. నీ కోసం నేను దేనికైనా సిద్ధపడతాననే విషయం నీకూ తెలుసు. హోలీ శుభాకాంక్షలు. నువ్వు కోల్పోయిన ఆనందాలనే రంగులను ఈ పండుగ వంద రెట్లు ఎక్కువగా నీ జీవితంలోకి తీసుకొస్తుంది. నీ జీవితాన్ని ప్రకాశవంతంగా మార్చడం నా బాధ్యత. నువ్వంటే నాకెంత ఇష్టమో నీక్కూడా తెలుసు. లవ్ యూ మై ప్రిన్సెస్. మై బొమ్మ’ అంటూ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పై తనకున్న ప్రేమను సుకేశ్ చంద్రశేఖర్ లేఖలో వ్యక్తం చేశాడు. 
sukesh
conman
Jacqueline
mandola jail
letter
holi wishes

More Telugu News