Andhra Pradesh: ‘జగనన్న విద్యాదీవెన’ మరోమారు వాయిదా.. మళ్లీ ఎప్పుడో చెప్పని ప్రభుత్వం

Jagananna Vidya Deevena Second time postponed
  • నిధుల విడుదలను రెండోసారి వాయిదా వేసిన ప్రభుత్వం
  • అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి గాను విద్యార్థులకు రూ. 700 కోట్ల రీయింబర్స్‌మెంట్
  • 2022-23 విద్యాసంవత్సరానికి 10.50 లక్షల మందికి ‘విద్యాదీవెన’
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు ప్రారంభించాల్సిన విద్యాదీవెన పథకం మరోమారు వాయిదా పడింది. 2022-23 విద్యా సంవత్సరానికి గాను 10.50 లక్షల మంది విద్యార్థులకు అక్టోబరు, నవంబరు, డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి రూ. 700 కోట్ల వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల్ని విడుదల చేయాల్సి ఉంది. 

సంక్షేమ క్యాలెండర్ ప్రకారం గత నెల 28నే ఈ నిధులను విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఆ తర్వాత దానిని మార్చి 7వ తేదీకి వాయిదా వేసింది. తాజాగా, ఇంకోసారి వాయిదా వేస్తున్నట్టు పేర్కొంటూ జిల్లాలకు ప్రభుత్వం సమాచారం పంపింది. అయితే, మళ్లీ ఎప్పుడన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
Andhra Pradesh
Jagananna Vidya Deevena
YSRCP
YS Jagan

More Telugu News