Hayley Matthews: హేలీ ధాటికి బెంగళూరు విలవిల.... ముంబయికి వరుసగా రెండో విజయం

Hayley Matthews smashed RCB bowling as Mumbai Indians bags second victory in WPL
  • డబ్ల్యూపీఎల్ లో కొనసాగుతున్న ముంబయి దూకుడు 
  • ఆర్సీబీపై 9 వికెట్ల తేడాతో ఘనవిజయం
  • 156 పరుగుల లక్ష్యాన్ని 14.2 ఓవర్లలో ఛేదించిన వైనం
  • హేలీ మాథ్యూస్ 38 బంతుల్లో 77 నాటౌట్
డబ్ల్యూపీఎల్ లో ముంబయి ఇండియన్స్ జోరు కొనసాగుతోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో ఘనంగా గెలిచారు. 156 పరుగుల విజయలక్ష్యాన్ని ముంబయి జట్టు 14.2 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టానికి ఛేదించింది. 

ఓపెనర్ హేలీ మాథ్యూస్ వీరవిహారం చేయడంతో ముంబయి ఇండియన్స్ పని సులువైంది. హేలీ మాథ్యూస్ 38 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్ తో 77 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. నాట్ షివర్ 29 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్ తో 55 పరుగులు చేసింది. ఓపెనర్ యస్తికా భాటియా 23 పరుగులు చేసింది. 

అంతకుముందు, టాస్ గెలిచిన ఆర్సీబీ 18.4 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌట్ అయింది. కాగా, ముంబయి ఇండియన్స్ కు టోర్నీలో ఇది రెండో విజయం కాగా, ఆర్సీబీ జట్టుకు ఇది రెండో ఓటమి.
Hayley Matthews
Mumbai Indians
RCB
WPL

More Telugu News