Revanth Reddy: రేవంత్ రెడ్డి భద్రతపై కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు

Telangana high court orders to give additional security to Revanth Reddy
  • తెలంగాణలో పాదయాత్ర చేపడుతున్న రేవంత్
  • అదనపు భద్రత కోసం హైకోర్టును ఆశ్రయించిన రేవంత్
  • ప్రస్తుత భద్రత ట్రాఫిక్ నియంత్రణకే సరిపోతోందని వెల్లడి
  • రేవంత్ పిటిషన్ పై విచారణ కొనసాగించిన కోర్టు
  • అదనపు భద్రత కల్పించాలంటూ ఆదేశాలు
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో పేరిట పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే తన పాదయాత్రకు అదనపు భద్రత కల్పించాలంటూ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. భద్రతపై ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తనకు ప్రభుత్వం కల్పిస్తున్న భద్రత కేవలం ట్రాఫిక్ నియంత్రణకే సరిపోతోందని తెలిపారు. అదనపు భద్రత తప్పనిసరి అని రేవంత్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

ఈ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు నేడు విచారణ కొనసాగించింది. రేవంత్ రెడ్డికి అదనపు భద్రత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, రేవంత్ రెడ్డి భద్రతపై అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు ఇచ్చారని ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. డీజీపీ ఆదేశాల ఫాక్స్ సందేశం ప్రతిని కోర్టుకు సమర్పించారు.
Revanth Reddy
Additional Security
TS High Court
Padayatra
Congress
Telangana

More Telugu News