ఎన్టీఆర్ 30వ సినిమా టీమ్ నుంచి జాన్వీ కపూర్ కి బర్త్ డే విషెస్!

  • ఎన్టీఆర్ 30వ సినిమాకి సన్నాహాలు 
  • త్వరలో మొదలుకానున్న రెగ్యులర్ షూటింగ్ 
  • హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఎంట్రీ 
  • వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమా రిలీజ్
Janhvi Kapoor Special

జాన్వీ కపూర్ కి బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. బాలీవుడ్ నుంచి ఇంతవరకూ ఆమెకి భారీ హిట్ పడనప్పటికీ, సోషల్ మీడియా ద్వారా ఈ బ్యూటీ తన క్రేజ్ ను కాపాడుకుంటూ వెళుతోంది. బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ రేసులో అడుగుపెట్టడానికి తనవంతు ప్రయత్నం చేస్తోంది. ఆ దిశగానే తదుపరి ప్రాజెక్టులను ఎంచుకుంటూ వెళుతోంది.

ఈ నేపథ్యంలోనే జాన్వీ తెలుగులో ఎన్టీఆర్ జోడీగా సినిమా చేయనున్నట్టు వార్తాలు వచ్చాయి. గతంలో కూడా కొన్ని ప్రాజెక్టులలో ఆమె పేరు వినిపిస్తూ వచ్చింది. అందువలన ఎన్టీఆర్ సినిమాలో ఆమె చేయనుందనే వార్తల్లో నిజం ఎంత? అనే సందేహమే చాలామందిలో ఉంది. తాజాగా వదిలిన జాన్వీ పోస్టర్ తో ఆ సందేహాలన్నీ తొలగిపోయాయి.

ఈ రోజున జాన్వీ పుట్టినరోజు. అందువలన ఎన్టీఆర్ 30వ సినిమా టీమ్ ఆమెకి విషెస్ తెలియజేస్తూ ఒక పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్ లో జాన్వీ మరింత గ్లామరస్ గా కనిపిస్తోంది. ఎన్టీఆర్ సినిమాలో ఆమె చేయడమనేది ఖాయమనే విషయం స్పష్టమైపోయింది.

ఎన్టీఆర్ తో ఈ సినిమాను కొరటాల శివ రూపొందిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్ - ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News