Amitabh Bachchan: ప్రమాదంలో గాయపడ్డ అమితాబ్.. ఆగిన షూటింగ్

Amitabh Bachchan injured in shooting
  • రామోజీ ఫిల్మ్ సిటీలో 'ప్రాజెక్ట్ కే' షూటింగ్
  • కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాదం
  • విరిగిన పక్కటెముక మృదులాస్థి

బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ షూటింగ్ లో గాయపడ్డారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'ప్రాజెక్ట్ కే' చిత్రంలో అమితాబ్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తున్న సమయంలో అమితాబ్ ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో ఆయనకు గాయాలయ్యాయి. పక్కటెముక మృదులాస్థి విరిగిందని, కుడి పక్కటెముక కండరం చిరిగిపోయిందని అమితాబ్ స్వయంగా తన బ్లాగ్ ద్వారా వెల్లడించారు. 

తాను గాయపడటంతో షూటింగ్ క్యాన్సిల్ అయిందని చెప్పారు. నాలుగు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న అమితాబ్ ముంబైకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన ముంబైలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్టు అమితాబ్ తెలిపారు.

  • Loading...

More Telugu News