Chandrababu: ఈ ప్రభుత్వానికి ఇప్పటం రోడ్డు మాత్రమే ఎందుకు కనిపిస్తోంది?: చంద్రబాబు

Chandrababu responds on Ippatam issue
  • ఇప్పటం గ్రామంలో మళ్లీ కూల్చివేతలు
  • రాష్ట్రంలో ఎన్నో రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్న చంద్రబాబు
  • సైకోతత్వం అంటూ వ్యాఖ్యలు
  • ప్రజలే మిమ్మల్ని మార్చేస్తారంటూ హెచ్చరిక
గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో అధికారులు మరోసారి కూల్చివేతలకు తెరలేపడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. రాష్ట్రంలో ఎన్నో రోడ్లు అధ్వానంగా ఉంటే, ఈ ప్రభుత్వానికి ఇప్పటం రోడ్డు మాత్రమే ఎందుకు కనిపిస్తోంది? అని ప్రశ్నించారు. "ఏదైనా మంచి పని కోసం వెనుకడుగు వేయకుండా పోరాడితే దాన్ని పట్టుదల అంటారు. కానీ, కసితో ఏదైనా కూల్చడమే లక్ష్యంగా పనిచేస్తే దాన్ని సైకోతత్వం అంటారు" అని చంద్రబాబు వివరించారు. 

మీరు ఎలాగూ మారరు... ప్రజలే మిమ్మల్ని మార్చేస్తారు అంటూ వైసీపీ నేతలను ఉద్దేశించి హెచ్చరించారు. ఈ మేరకు ఇప్పటం కూల్చివేతలపై ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని కూడా పంచుకున్నారు.
Chandrababu
Ippatam
TDP
YSRCP

More Telugu News