Pushpa: ఆసీస్ ఫ్యాన్.. పుష్ప మేనరిజం.. వీడియో వైరల్!

Australia Fans Jhukega Nahi Celebration Goes Viral After 3rd Test Win
  • ఇటీవల టీమిండియాపై మూడో టెస్టులో గెలిచిన ఆస్ట్రేలియా
  • స్టేడియంలో సంబరాలు చేసుకున్న ఆసీస్ అభిమానులు
  • ‘ఝుకేగా నహీ’ అంటూ యువకుడి హల్ చల్
ఎప్పుడో ఏడాది కిందట వచ్చింది ‘పుష్ప’ మూవీ. తెలుగులోనే కాదు పలు భాషల్లో సూపర్ హిట్ అయింది. అందులో అల్లు అర్జున్ మేనరిజం అంతకన్నా ఎక్కువే హిట్ అయింది. ‘తగ్గేదే లే’ అంటూ చెప్పే డైలాగ్ ప్రతి నోటా వినిపించింది. యువతే కాదు.. క్రికెటర్ల నుంచి రాజకీయ నాయకుల దాకా అందరూ ఆ డైలాగ్ చెప్పిన వాళ్లే. చెబుతున్న వాళ్లే.

తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఓ యువకుడు ‘ఝుకేగా నహీ’ అని హిందీ డైలాగ్ చెబుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ముగిసిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా గెలిచిన విషయం తెలిసిందే కదా. వరుసగా రెండు ఓటముల తర్వాత దక్కిన గెలుపు కావడంతో ఆసీస్ ప్లేయర్లు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.

ఈ సందర్భంగా ఇండోర్ స్టేడియంలో ఓ ఆసీస్ అభిమాని.. పుష్ప మేనరిజం అనుకరించాడు. గడ్డం కింద చెయ్యి తిప్పుతూ..  ‘ఝుకేగా నహీ సాలా’ అంటూ గట్టిగా అరిచాడు. దీంతో అతడి చుట్టూ ఉన్న వాళ్లు కూడా అరిచేశారు.

దీనిపై నెటిజన్లు చిత్ర విచిత్ర కామెంట్లు చేస్తున్నారు. తర్వాతి మ్యాచ్ లో అతడిని, ఆసీస్ ను దించేస్తాం (ఝుకా దేంగే) అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. ‘తగ్గేదేలే అంటున్నావ్.. తొలి రెండు టెస్టుల్లో తగ్గించా కదా’ అని మరొకరు కౌంటర్ ఇచ్చారు.
Pushpa
Australia Fans
Jhukega Nahi
thaggede le
border gavaskar trophy
Australia
Team India

More Telugu News