Bandi Sanjay: భారీ ఉద్యమాలు చేస్తాం... ఆ తర్వాత మీదే బాధ్యత: సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ

Bandi Sanjay shot a letter to CM KCR
  • ప్రభుత్వానికి కొన్నినెలలు మాత్రమే గడువు మిగిలుందన్న సంజయ్
  • ప్రజలను దారుణంగా మోసం చేశారని వెల్లడి
  • ఇచ్చిన హామీలపై కార్యాచరణ రూపొందించాలని డిమాండ్
తెలంగాణ సీఎం కేసీఆర్ కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇంకా కొన్ని నెలలు మాత్రమే గడువు మిగిలుందని, అయినా హామీలను అమలు చేయకపోవడం ప్రజలను దారుణంగా మోసగించడమేనని విమర్శించారు. 

మార్చి 9న జరిగే క్యాబినెట్ సమావేశంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ఓ కార్యాచరణ రూపొందించాలని డిమాండ్ చేశారు. లేకపోతే హామీల అమలు కోసం ప్రజలతో కలిసి తెలంగాణ బీజేపీ భారీ ఉద్యమాలు చేపడుతుందని, జరగబోయే పరిణామాలకు రాష్ట్ర సర్కారుదే బాధ్యత అని బండి సంజయ్ హెచ్చరించారు. 

"బీఆర్ఎస్ పాలనలో ప్రజలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఉద్యోగుల సమస్యలేవీ పరిష్కారం కావడంలేదు. తక్షణమే పీఆర్సీ ఏర్పాటు చేయాలి. పెరిగిన వేతనాలు జులై 1 నుంచి చెల్లించేలా చర్యలు తీసుకోవాలి" అని స్పష్టం చేశారు.
Bandi Sanjay
CM KCR
Letter
BJP
BRS
Telangana

More Telugu News