PR agency: అభిమాని ప్రశ్నకు యామీ గౌతమ్ ఊహించని రిప్లయ్

Yami Gautam reacts to Twitter user who said she needs to hire better PR agency as it would do wonders to her career
  • మంచి పీఆర్ ఏజెన్సీని నియమించుకోవాల్సిన అవసరం ఉందన్న అభిమాని
  • అప్పుడు యామీ కెరీర్ లో అద్భుతాలు జరుగుతాయన్న అభిప్రాయం
  • ఆలస్యమైనా సొంత బాటే మేలన్న నటి
మంచి పబ్లిక్ రిలేషన్స్ (పీఆర్) ఏజెన్సీని నియమించుకోవాలంటూ ఓ అభిమాని నటి యామీ గౌతమ్ కు సలహా ఇచ్చాడు. దీనికి యామీ ట్విట్టర్ లో చాలా చక్కగా స్పందించింది. ‘‘పీఆర్ కార్యకలాపాలు, సమీక్షలు, ధోరణి, అవగాహన, ఇమేజ్ పై ఆధారపడే నటులను చూశాను. అయితే, నేను ఎవరినీ జడ్జ్ చేయడం లేదు. కానీ, ‘నీవు చేసే పని నీకు మంచి పీఆర్ అవుతుంది’అన్నది నేను నమ్ముతాను. ఇది సుదీర్ఘమైన బాట (సొంతంగా పేరు తెచ్చుకునేందుకు) అయినా కానీ, సరైన దిశగా ముందుకు తీసుకెళుతుంది’’అని యామీ పేర్కొంది.

‘‘యామీ గౌతమ్ మంచి పీఆర్ ఏజెన్సీని నియమించుకోవాలి. అది ఆమె కెరీర్ కు అద్భుతాలు తీసుకొస్తుంది’’అన్నది అభిమాని సూచనగా ఉంది. యామీ గౌతమ్ ఇటీవలే అనిరుద్ధ రాయ్ చౌదరీకి చెందిన థ్రిల్లర్ సినిమా ‘లాస్ట్’లో నటించడం తెలిసిందే. ఈ నెల 24న నెట్ ఫ్లిక్స్ లో విడుదలయ్యే చోర్ నికాల్ కే బాగాలో కనిపించనుంది. తనకు పీఆర్ టీమ్ అక్కర్లేదంటూ యామీ గౌతమ్ పరోక్షంగా చెప్పిన అభిప్రాయంతో కొందరు విభేదిస్తుంటే, కొందరు సమర్థిస్తున్నారు.
PR agency
need
yami gautam
fan
advise
reaction

More Telugu News