టీడీపీ హయాంలో ఎన్ని పరిశ్రమలు తెచ్చారు?: బాలినేని
- జగన్ మొదటి నుంచి ఓ విజన్‌తో ముందుకు వెళ్తున్నారన్న బాలినేని
- ప్రజలకు మంచి జరగాలనే విశాఖ రాజధాని అని వెల్లడి
- పెట్టుబడుల సదస్సుతో లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశముందని వ్యాఖ్య
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖేష్ అంబానీ లాంటి వ్యాపారవేత్తలు ముందుండి విశాఖ సదస్సును విజయవంతం చేశారని కొనియాడారు. పెట్టుబడుల సదస్సుతో లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. గతంలో టీడీపీ హయాంలో ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చారో సమాధానం చెప్పాలని బాలినేని డిమాండ్ చేశారు. ఏపీని దేశంలోనే అగ్రగామికి నిలబెట్టేందుకు జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు.
ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశ్యంతోనే విశాఖ రాజధాని అని వెల్లడించారు. అభివృద్ధి చెందిన సిటీని మరింత వేగంగా అభివృద్ధి చేయవచ్చని, అమరావతి లాంటి ప్రాంతాన్ని అభివృద్ది చేయాలంటే రూ. లక్షల కోట్లు కావాలని అన్నారు.