Cricket: మహిళల ప్రీమియర్ లీగ్ తొలి మ్యాచ్​ టైమింగ్ మార్పు... కారణం ఇదే

  • అరగంట ఆలస్యంగా రాత్రి 8 గంటల నుంచి జరుగుతుందన్న బీసీసీఐ
  • సాయంత్రం 6.25 నుంచి ప్రారంభోత్సవం 
  • అలరించనున్న బాలీవుడ్ స్టార్స్ కృతి సనన్, కియారా, కెనడా సింగర్ ధిల్లాన్
Rescheduled start for TATA Womens Premier League opening fixture

భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా మహిళా క్రికెటర్లు ఎంతగానో ఎదురు చూస్తున్న మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)కు రంగం సిద్ధమైంది. ఈ మెగా లీగ్ ఈ రోజే మొదలవుతుంది. డబ్ల్యూపీఎల్‌ మొదటి సీజన్ లో ఐదు జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్ లో మొత్తం 22 మ్యాచ్ లు ఉన్నాయి. ఈ నెల 26న ఫైనల్‌ జరగనుంది. తొలి సీజన్ లో అన్ని మ్యాచ్ లు ముంబైలోని బ్రబౌర్న్, డీవై పాటిల్ స్టేడియాల్లో షెడ్యూల్ చేశారు. ఈ రోజు జరిగే తొలి మ్యాచ్ లో గుజరాత్‌ జెయింట్స్‌, ముంబై ఇండియన్స్‌ పోటీ పడనున్నాయి. 

అయితే, తొలి మ్యాచ్ షెడ్యూల్ లో మార్పు చేసినట్టు బీసీసీఐ ప్రకటించింది. ఈ మ్యాచ్‌ రాత్రి 7.30కి మొదలు కావాల్సింది. కానీ, అరగంట ఆలస్యంగా రాత్రి 8 గంటలకు మొదలవుతుందని తెలిపింది. అలాగే, మ్యాచ్ కు ముందు ప్రారంభోత్సవాన్ని సాయంత్రం 5.30 గంటలకు కాకుండా 6.25 గంటలకు ప్రారంభం అవుతుందని తెలిపింది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్స్‌ కృతి సనన్‌, కియారా అద్వానీ తో పాటు కెనడా పాప్ సింగర్ ఏపీ ధిల్లాన్‌ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కాగా, ఈ టోర్నీని మిగతా మ్యాచ్ లు ముందుగా నిర్ణయించిన సమయానికే జరుగుతాయి. రాత్రి మ్యాచ్ 7.30 గంటలకు, డబుల్ హెడర్ లో మొదటి మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు మొదలవుతుంది.

More Telugu News