Bill Gates: భారత్ అభివృద్ధి ఇలాగే కొనసాగాలి: బిల్ గేట్స్

  • ఢిల్లీలో ప్రధాని మోదీతో బిల్ గేట్స్ సమావేశం
  • అనేక అంశాలపై చర్చ
  • భారత్ ను డైనమిక్ దేశంగా అభివర్ణించిన గేట్స్
  • కొవిన్ యాప్ తో ప్రపంచానికి మోడల్ గా నిలిచిందని కితాబు
Bill Gates wrote about Indian in his blog

ప్రపంచ కుబేరుల్లో ఒకరు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారత పర్యటన సందర్భంగా నిన్న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. అనేక అంశాలపై మోదీతో విస్తృతంగా చర్చించారు. ఈ భేటీ గురించి బిల్ గేట్స్ తన బ్లాగ్ లో వివరించారు. సృజనాత్మక రంగంలో పెట్టుబడులతో ఎలాంటి అద్భుతాలు సాధించవచ్చో భారత్ నిరూపించిందని కొనియాడారు. భారత్ ఇదే తరహాలో అభివృద్ధిని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నట్టు వివరించారు.

ప్రపంచమంతా సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ భారత్ వంటి శక్తిమంతమైన, సృజనాత్మక దేశాన్ని సందర్శించడం ఎంతో ప్రేరణ కలిగిస్తోందని తెలిపారు. 

అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న భారత్... కరోనా సంక్షోభ సమయంలో సురక్షితమైన వ్యాక్సిన్లను రూపొందించి కోట్లాది మంది ప్రాణాలను కాపాడిందని కీర్తించారు. ఆ వ్యాక్సిన్లను ఇతర దేశాలకు కూడా అందించడం ద్వారా స్నేహబంధానికి విలువ ఇచ్చిందని వివరించారు. 

కరోనా వేళ భారత్ రూపొందించిన కొవిన్ యాప్ ప్రపంచానికి దారిచూపుతుందని ప్రధాని మోదీ బలంగా నమ్మారని, ఆయనతో తాను కూడా ఏకీభవిస్తున్నానని బిల్ గేట్స్ పేర్కొన్నారు. భారత్ ఇకపైనా తన ఆవిష్కరణలను మిగతా ప్రపంచంతో పంచుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు.

More Telugu News