Karnataka: బెడిసి కొట్టిన మేకప్.. వధువు ముఖం చూసి పెళ్లి రద్దు చేసుకున్న వరుడు

Karnataka womans face disfigured during makeup groom calls off wedding
  • కర్ణాటకలో ఓ బ్యూటీ పార్లర్ నిర్వాకంతో ఆసుపత్రిపాలైన యువతి
  • మేకప్ ఫౌండేషన్ తర్వాత స్టీమ్ పట్టడంతో వాచిపోయిన ముఖం
  • బ్యూటీ పార్లర్ పై పోలీసులుకు ఫిర్యాదు చేసిన యువతి కుటుంబం
ఏదైనా శుభకార్యం, పంక్షన్ కు వెళ్తుంటే మహిళలు అందంగా ముస్తాబవుతారు. పెళ్లి వేడుక అయితే బ్యాటీ పార్లర్లకు వెళుతుంటారు. కానీ, ఓ బ్యూటీ పార్లర్ నిర్వాకంతో అందంగా కనిపించాల్సిన పెళ్లి కూతురు ముఖం పూర్తిగా వాచిపోయి ఆసుపత్రి పాలైంది. మేకప్ బెడిసికొట్టడంతో అందవికారంగా తయారైన వధువును చూసి వరుడు కంగుతిని పెళ్లి రద్దు చేసుకున్నాడు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన వధువు ఆసుపత్రి పాలైంది. ఈ సంఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. 

హసన్ జిల్లాకు చెందిన ఓ యువతి పెళ్లి వేడుకలో అందంగా కనిపించాలని బ్యూటీ పార్లర్ కు వెళ్లింది. మేకప్ లో భాగంగా ఫౌండేషన్ తర్వాత ఆవిరి పట్టారు. బ్యూటీ పార్లర్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా స్టీమ్ ఎక్కువై ఆ వేడికి యువతి ముఖమంతా వాచిపోయి అందవికారంగా తయారయ్యింది. ముఖమంతా నల్లగా మారింది. కళ్లు, బుగ్గలు వాచిపోయాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. బ్యూటీ పార్లర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బ్యూటీ పార్లర్ యజమానికి నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు.
Karnataka
marriage
womans face
disfigured
makeup
groom
calls off wedding

More Telugu News