Revanth Reddy: రేవంత్ రెడ్డి కాన్వాయ్ లో ప్రమాదం.. ఢీకొన్న 6 కార్లు

Accident in Revanth Reddy convoy
  • సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రమాదం
  • ఎయిర్ బ్యాగ్ లు ఓపెన్ కావడంతో రేవంత్ కు తప్పిన ప్రమాదం
  • స్వల్ప గాయాలతో బయటపడ్డ రిపోర్టర్లు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళుతున్న కాన్వాయ్ లో 6 కార్లు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. అయితే కార్లలోని ఎయిర్ బ్యాగ్ లు ఓపెన్ కావడంతో రేవంత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ వద్ద చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన కార్లలో రెండు కార్లలో మీడియా ప్రతినిధులు ఉన్నారు. వీటిలో టీవీ9, ఎన్టీవీ, సాక్షి, ఏబీఎన్, బిగ్ టీవీ న్యూస్ నౌ రిపోర్టర్లు ఉన్నట్టు సమాచారం. సిరిసిల్ల రిపోర్టర్లయిన వీరంతా స్వల్ప గాయాలతో బయటపడినట్టు తెలుస్తోంది. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Revanth Reddy
Congress
Convoy
Accident

More Telugu News