Indore Pitch: ఇండోర్ పిచ్ పై తీవ్రంగా స్పందించిన ఐసీసీ

  • మూడో రోజు ఉదయానికే ముగిసిన మ్యాచ్
  • టీమిండియాను 9 వికెట్ల తేడాతో ఓడించిన ఆసీస్
  • పిచ్ పై మ్యాచ్ రిఫరీ నివేదిక
  • తమ అభిప్రాయాలు వెల్లడించిన రోహిత్ శర్మ, స్టీవ్ స్మిత్
  • నాసిరకం పిచ్ అంటూ తీర్పు ఇచ్చిన ఐసీసీ
ICC terms Indore pitch Poor

టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు కోసం ఇండోర్ హోల్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పిచ్ పై ఐసీసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మ్యాచ్ మూడో రోజు ఉదయమే ముగియడంతో పిచ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. 

ఈ నేపథ్యంలో మ్యాచ్ ముగిసిన అనంతరం రిఫరీ క్రిస్ బ్రాడ్ ఐసీసీకి నివేదిక సమర్పించారు. ఇరుజట్ల కెప్టెన్లు రోహిత్ శర్మ, స్టీవ్ స్మిత్ ల అభిప్రాయాలను కూడా ఆ నివేదికలో పొందుపరిచారు. నివేదిక పరిశీలించిన ఐసీసీ... ఇండోర్ పిచ్ ను నాసిరకం పిచ్ గా పేర్కొంది. అంతేకాదు, ఈ మైదానానికి 3 డీమెరిట్ పాయింట్లను కూడా విధించింది. కాగా, ఐసీసీ నిర్ణయంపై అప్పీల్ చేసుకునేందుకు బీసీసీఐకి 14 రోజుల గడువు లభించింది. 

ఇండోర్ పిచ్ పై బ్యాటింగ్ చేసేందుకు ఇరుజట్ల ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. తొలి రోజే 14 వికెట్లు పతనం అయ్యాయి. ఈ మ్యాచ్ మొత్తమ్మీద 31 వికెట్లు పడగా, అందులో 26 వికెట్లు స్పిన్నర్లకే దక్కాయంటే పిచ్ పై బంతి ఎలా టర్న్ అయిందో చెప్పవచ్చు.

More Telugu News