Junior NTR: ఎన్టీఆర్ కోసం అవార్డును భారత్ కు పంపిస్తున్న హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్

Hollywood Critics Association will send award to NTR for RRR
  • ఆర్ఆర్ఆర్ కు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులు
  • స్వీకరించిన రాజమౌళి, రామ్ చరణ్
  • అమెరికా వెళ్లలేకపోయిన ఎన్టీఆర్
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రం అమెరికాలోనూ సందడి చేస్తోంది. ఆస్కార్ పండుగకు ముందు జరిగే వివిధ అవార్డుల కార్యక్రమాల్లో ఆర్ఆర్ఆర్ పలు పురస్కారాలను సొంతం చేసుకుని హాలీవుడ్ ప్రముఖులను సైతం ఆకట్టుకుంటోంది. 

ఇటీవల ఆర్ఆర్ఆర్ కు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులు లభించగా, దర్శకుడు రాజమౌళి, హీరో రామ్ చరణ్, సంగీత దర్శకుడు కీరవాణి, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ హాజరయ్యారు.

అయితే, వివిధ కారణాల వల్ల జూనియర్ ఎన్టీఆర్, ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన అలియా భట్ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులు అందుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో, ఎన్టీఆర్, అలియా భట్ లకు వచ్చేవారం అమెరికా నుంచి అవార్డులను పంపించాలని నిర్ణయించినట్టు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ వెల్లడించింది. 

ఈ మేరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు సందేశం అందించింది. అంతేకాదు, ఎన్టీఆర్, అలియా భట్ లకు పంపించే అవార్డు ట్రోఫీలను ప్యాక్ చేసిన వెల్వెట్ బాక్సు ఫొటోను కూడా క్రిటిక్స్ అసోసియేషన్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
Junior NTR
Hollywood Critics Association
Award
RRR
India
USA

More Telugu News