Antony Blinken: ఆటో ఎక్కి క్వాడ్ దేశాల సదస్సుకు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి

US Foreign Secretary Antony Blinken have an auto ride to reach QUAD Nations Summit
  • భారత్ పర్యటనకు వచ్చిన ఆంటోనీ బ్లింకెన్
  • ఢిల్లీలో క్వాడ్ దేశాల సదస్సు
  • ఆటోలో దిగిన బ్లింకెన్
ఢిల్లీలో క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కూడా విచ్చేశారు. కాగా, ఆయన ఈ సమావేశానికి ఓ ఆటోలో ఎక్కి రావడం అందరి దృష్టినీ ఆకర్షించింది. దీనికి సంబంధించిన ఫొటోలను బ్లింకెన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

ఢిల్లీలోని తమ దౌత్య కార్యాలయ సిబ్బంది, హైదరాబాద్, కోల్ కతా, చెన్నై, ముంబయిలోని తమ కాన్సులేట్ జనరల్ కార్యాలయాల సిబ్బందిని, వారి కుటుంబాలను అందరినీ ఒక్కచోట కలుసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. అమెరికా, భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం అయ్యేలా, ప్రజల మధ్య పరస్పర సంబంధాల కోసం తమ సిబ్బంది ఎంతో కృషి చేస్తున్నారంటూ కొనియాడారు.
Antony Blinken
Auto
QUAD Summit
New Delhi
USA
India

More Telugu News