Bollywood: షారుఖ్ ఖాన్ బంగ్లా ‘మన్నత్’ లో చొరబడ్డ ఇద్దరు యువకులు

2 Detained For Breaking Into Shah Rukh Khans Bungalow Mannat
  • ప్రహరీ దూకి బంగ్లా ప్రాంగణంలోకి వచ్చిన వారిని పట్టుకున్న భద్రతా సిబ్బంది
  • షారుఖ్ ను కలిసేందుకు గుజరాత్ నుంచి వచ్చామని వెల్లడించిన యువకులు
  • ‘పఠాన్’ చిత్రంతో ఘన విజయం సొంతం చేసుకున్న షారుఖ్
ముంబైలోని బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ బంగ్లా మన్నత్‌లోకి గురువారం ఇద్దరు యువకులు చొరబడటం కలకలం రేపింది. ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రహరీ గోడను దూకిన ఇద్దరు యువకులు మన్నాత్ ప్రాంగణంలోకి ప్రవేశించారు. అప్రమత్తం అయిన భద్రతా సిబ్బంది వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.  పోలీసుల విచారణలో 20, 22 సంవత్సరాల మధ్య వయస్సు గల ఆ యువకులు తాము గుజరాత్ నుంచి వచ్చామని, షారుఖ్ ను కలవాలనుకుంటున్నామని చెప్పారు. వారిపై భారత శిక్షాస్మృతి (ఐపీసీ) కింద అతిక్రమణ , ఇతర సంబంధిత నేరాల కేసు నమోదు చేశారు. ఘటనపై పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు.

కాగా, వరుస పరాజయాల తర్వాత షారుఖ్ ఖాన్ 'పఠాన్' చిత్రంతో ఘన విజయం సొంతం చేసుకున్నారు.  బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులను బద్దలు కొట్టిన ఈ సినిమా ఇంకా దూసుకెళ్తోంది. జాన్ అబ్రహం, దీపికా పదుకొణే కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1,000 కోట్ల వసూళ్లు రాబట్టింది. షారుక్ ప్రస్తుతం 'జవాన్', 'డుంకీ' చిత్రాల్లో నటిస్తున్నారు.
Bollywood
Shahrukh Khan
mannat
mumbai
police

More Telugu News