IPL 2023: చెన్నైకి చేరుకున్న సీఎస్కే సారథి ఎంఎస్ ధోనీ

Indian Premier League 2023 CSK captain MS Dhoni arrives in Chennai
  • ఐపీఎల్ కు 25 రోజుల ముందే రాక
  • ప్రాక్టీస్ మ్యాచ్ మొదలు పెట్టనున్న సీఎస్కే
  • ఈ ఏడాదితో ఐపీఎల్ కు ధోనీ గుడ్ బై
మహేంద్ర సింగ్ ధోనీ (ఎంఎస్ ధోనీ) హ్యాండ్ బాగ్ తో చెన్నై చేరుకున్నాడు. ‘మొత్తానికి థలా దర్శనం’ అంటూ ఐపీఎల్ చెన్నై జట్టు ట్విట్టర్ లో చిన్న ట్వీట్ చేసింది. ఈ నెల 31 నుంచి ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభం కాబోతోంది. మొదటి మ్యాచ్ లో చెన్నై జట్టు, గుజరాత్ జట్టుతో పోటీ పడనుంది. 

ఏటా నిర్ణీత షెడ్యూల్ కంటే ముందు నుంచే చెన్నై జట్టు ప్రాక్టీస్ మొదలు పెడుతుంది. అదే మాదిరి ఈ ఏడాది కూడా ముందుగానే సాధన మొదలు పెట్టనుంది. చెన్నై లోగోతో ఉన్న బ్లూ రంగు టీషర్ట్ ధరించిన ధోనీ, ముఖానికి బ్లాక్ మాస్క్ పెట్టుకోవడం గమనించొచ్చు. ధోనీకి ఇది 16వ ఐపీఎల్ ఎడిషన్. ఆరంభం నుంచి, మధ్యలో రెండేళ్ల విరామం మినహా జట్టు సారథిగా ధోనీయే కొనసాగుతున్నాడు. 

ఇక ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అవుతుందని అంచనా. 40 ప్లస్ వయసుకు వచ్చిన ధోనీ, ఇప్పటికీ కుర్రాళ్లతో పోటీపడుతుండడాన్ని చూడొచ్చు. సీఎస్కే సారథిగా గతేడాది జడేజాకి అవకాశం ఇచ్చినా ఫలితం లేకపోవడంతో, తిరిగి ధోనీయే జట్టును నడిపించాల్సి వచ్చింది. ఇక ఈ ఏడాదితో ధోనీ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలున్నాయి. సారథి మార్పుతో గత సీజన్ లో సీఎస్కే ప్లే ఆఫ్ కు రాకుండానే నిష్క్రమించాల్సి వచ్చింది. మరి ఈ విడత ఏం జరుగుతుందో చూడాలి. ఇంగ్లడ్ ప్లేయర్ బెన్ స్టోక్స్ ను భారీ మొత్తం వెచ్చించి సీఎస్కే కొనుగోలు చేయడం తెలసిందే. తద్వారా తమ గెలుపు అవకాశాలను పెంచుకోవాలని అనుకుంటోంది.
IPL 2023
MS Dhoni
CSK captain
arrived chennai

More Telugu News