Viral video: ట్రాక్టర్ దానంతట అదే ఎలా స్టార్ట్ అయ్యిందో?

Viral video shows tractor starting on its own entering shop in UPs Bijnor
  • ఉత్తరప్రదేశ్ లోని బిజ్ నోర్ లో ఘటన
  • సీసీటీవీ కెమెరాలో రికార్డ్
  • దర్యాప్తు ఆరంభించిన పోలీసులు
ఒక్కోసారి ఏదో తెలియని వింతలు జరుగుతుంటాయి. ఇది కూడా అలాంటిదేనని అనుకోవచ్చు. ఉత్తరప్రదేశ్ లోని బిజ్ నోర్ లో అది ఒక షోరూమ్. షోరూమ్ లోపల ఓ వ్యక్తి పనిచేసుకుంటున్నాడు. కిషన్ కుమార్ అనే వ్యక్తి ట్రాక్టర్ ను అక్కడ పార్క్ చేసి వెళ్లాడు. ఏమైందో కానీ, ఉన్నట్టుండి ట్రాక్టర్ ముందుకు కదలడం మొదలు పెట్టింది. ముందున్న గ్లాస్ డోర్ వైపు దూసుకువచ్చింది. ఈ ధాటికి షోరూమ్ అద్దాలు పగిలిపోయాయి. 

షోరూమ్ లో ఉన్న వ్యక్తి ట్రాక్టర్ ను ఆపేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. కంగారులో అటూ, ఇటూ పరుగెత్తాడు. ఈ లోపు షోరూమ్ లో ఉన్న మరో వ్యక్తి వచ్చి ట్రాక్టర్ ఇంజన్ ఆఫ్ చేసి ఊపిరి పీల్చుకున్నాడు. ట్రాక్టర్ ఎలా ఆన్ అయ్యింది. ముందుకు అలా ఎందుకు దూసుకువచ్చిందన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలపైకి చేరింది. కొట్వాలి సిటీ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఈ షోరూమ్ ఉండడం గమనార్హం. దీంతో పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
Viral video
tractor
starting on its own
Uttar Pradesh
Bijnor

More Telugu News