Manchu Vishnu: ఈ వీడియో చూసి నా కళ్లలో నీళ్లు తిరిగాయి: మంచు విష్ణు

I started crying at the end of the song says Manchu Vishnu
  • నిన్న 15వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న విష్ణు, విరానికా
  • తల్లిదండ్రులకు వీడియోను బహుమతిగా ఇచ్చిన అరియానా, వివియానా
  • సాంగ్ పూర్తవుతున్న సమయంలో ఏడ్చేశానన్న విష్ణు
సినీ హీరో మంచు విష్ణు, ఆయన భార్య విరానికా నిన్న 15వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. కుటుంబసభ్యుల సమక్షంలో సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా వారి పిల్లలు అరియానా, వివియానా వారి తల్లిదండ్రులకు ఓ వీడియోను బహుమతిగా ఇచ్చారు. ఈ వీడియోలో విష్ణు, విరానికాకు సంబంధించిన ప్రత్యేకమైన మూమెంట్స్ ను ఉంచారు. అంతేకాదు మై ఫాదర్ లవ్స్ మై మామ్ అనే పాటను కూడా వారు ఆలపించారు. ఈ వీడియోను విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సాంగ్ పూర్తి అవుతున్న సమయంలో తాను ఏడ్చేశానని చెప్పాడు. తన చిన్ని తల్లులు ఇచ్చిన గిఫ్ట్ ను తాను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నాడు.
Manchu Vishnu
Wedding Anniversary
Tollywood

More Telugu News