cancers: స్థూలకాయంతో కేన్సర్ల ముప్పు!

  • పది రకాలకు పైగా కేన్సర్లు వచ్చే రిస్క్
  • అధిక బరువుతో శరీరంలో ఇన్ ఫ్లమేషన్
  • డీఎన్ఏ దెబ్బతినొచ్చు
  • బీఎంఐ 25కి మించకుండా చూసుకోవాలి
More than 10 cancers are related to obesity

అధిక బరువు తగ్గించుకోవాలని వైద్యులు తరచూ సూచిస్తుంటారు. స్థూలకాయంతో ఎన్నో ఆరోగ్య సమస్యల ముప్పు ఉందని ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. అధిక బరువు వల్ల దీర్ఘకాలంలో శరీరానికి ఎంతో హాని జరుగుతుందని చెప్పాయి. ప్రాణాంతకమైన ఎన్నో కేన్సర్లకు స్థూల కాయం కారణమవుతుందని తాజాగా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ కేన్సర్ల ముప్పు..
యూఎస్ సీడీసీ వెబ్ సైట్ ప్రకారం.. అడెనో కార్సినోమా ఈసోఫాజెస్, బ్రెస్ట్ కేన్సర్, కొలన్ కేన్సర్, రెక్టమ్ కేన్సర్, యుటరస్ కేన్సర్, గాల్ బ్లాడర్ కేన్సర్, స్టొమక్ కేన్సర్, కిడ్నీ కేన్సర్, లివర్ కేన్సర్, ఒవేరియన్ కేన్సర్, పాంక్రియాస్ కేన్సర్, థైరాయిడ్ కేన్సర్, బ్రెయిన్ కేన్సర్ తదితర కేన్సర్లు స్థూలకాయం వల్ల రావచ్చని తెలుస్తోంది.

ఎందుకని..?
ఫ్యాట్ తో కూడిన టిష్యూ వల్ల అధికంగా ఈస్ట్రోజన్ ఉత్పత్తి అవుతుంది. ఇది బ్రెస్ట్ కేన్సర్, ఎండో మెట్రియల్, ఒవేరియన్ కేన్సర్ కు కారణమవుతుంది. అధిక బరువు ఉన్న వారిలో అధికంగా ఇన్సులిన్ ఉంటుంది. ఈ హైపర్ ఇన్సులేమియా అనేది కేన్సర్ ముప్పు తెచ్చి పెడుతుంది. స్థూలకాయం ఆక్సిడేటివ్ స్ట్రెస్ కు కారణమవుతుంది. డీఎన్ఏకీ నష్టాన్ని కలిగిస్తుంది. దీంతో కేన్సర్ల రిస్క్ పెరుగుతుంది.

తగినంత ఉండాలి..
బాడీమాస్ ఇండెక్స్ సాధారణ స్థాయికి మించి బరువు లేకుండా చూసుకోవడం అవసరం. 18.5 నుంచి 24.9 వరకు ఆరోగ్యకరమైన బీఎంఏగా పరిగణిస్తారు. 25కు పైన ఉంటే దాన్ని అధిక బరువుగా.. ఇక 30కి పైన బీఎంఐ ఉంటే వారిని స్థూలకాయులుగా పేర్కొంటారు. కనుక బీఎంఐ 25కు తీసుకొచ్చేందుకు వెంటనే కృషి మొదలుపెట్టాలి. పోషకాహారం తీసుకుంటూ, నిత్యం వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గుతారు.

More Telugu News