Raviteja: 'రావణాసుర' టీజర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు!

Ravanasura Teaser Release date confirmed
  • అభిషేక్ పిక్చర్స్ నుంచి 'రావణాసుర'
  • రవితేజ సరసన ఐదుగురు భామలు
  • ఈ నెల 6వ తేదీన టీజర్ రిలీజ్ 
  • వచ్చేనెల 7వ తేదీన సినిమా విడుదల 
రవితేజ కథానాయకుడిగా 'రావణాసుర' రూపొందింది. అభిషేక్ నామ నిర్మించిన ఈ సినిమాకి, రవితేజ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. ఈ సినిమాకి సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు. హర్షవర్ధన్ రామేశ్వర్ .. భీమ్స్ సంగీతాన్ని సమకూర్చారు. ఫస్టు లుక్ బయటికి వచ్చిన దగ్గర నుంచి ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ పోతున్నాయి. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి టీజర్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 6వ తేదీన ఉదయం 10:08 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఆ విషయాన్ని తెలియజేస్తూ అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను విడుదల చేశారు. 

ఈ సినిమాలో రవితేజ రవితేజ సరసన అనూ ఇమ్మాన్యుయేల్ .. మేఘ ఆకాశ్ .. ఫరియా అబ్దుల్లా .. దక్ష నగార్కర్ .. పూజిత పొన్నాడ కనిపించనున్నారు. ఇతర ముఖ్యమైన పాత్రలను రావు రమేశ్ .. మురళీ శర్మ .. సంపత్ రాజ్ పోషించారు. ఏప్రిల్ 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
Raviteja
Anu Emmanuel
Megha Akash
Ravanasura Movie

More Telugu News