Z+ security: భారత్ తో పాటు విదేశాల్లోనూ ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబానికి జడ్ ప్లస్ భద్రత: కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం

Give Z plus security cover to Mukesh Ambani family SC asks Centre
  • స్వదేశంలో మహారాష్ట్ర ప్రభుత్వం, హోంశాఖ భద్రత ఇవ్వాలని సూచన
  • విదేశాల్లో ఆ బాధ్యత హోం శాఖదన్న సుప్రీం
  • భద్రత ఖర్చులన్నీ అంబానీ భరిస్తారని ఉత్తర్వులు 
భారత వ్యాపార దిగ్గజం, రిలయన్స్ అధినేత  ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబానికి జడ్ ప్లస్ భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. ముంబైలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా వారికి భద్రత కల్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భద్రతా ఏర్పాట్లకు అయ్యే ఖర్చులన్నీ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ భరిస్తారని కోర్టు తెలిపింది. 

ముకేశ్ కుటుంబానికి భద్రతపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. న్యాయమూర్తులు కృష్ణ మురారి, అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం అంబానీ కుటుంబానికి దేశంలో మహారాష్ట్ర ప్రభుత్వం, హోం శాఖ భద్రత కల్పించాలని పేర్కొంది. అలాగే వారు విదేశాలకు వెళ్లినప్పుడు హోం శాఖ వారికి భద్రతా ఏర్పాట్లు చేయాలని కోర్టు ఆదేశించింది. 
Z+ security
Mukesh Ambani
security
Supreme Court
central govt

More Telugu News