వీధికుక్కల దాడిలో మృతిచెందిన బాలుడి కుటుంబానికి రూ.10 లక్షలు
- ఇటీవల అంబర్ పేటలో దారుణం
- కుక్కలు దాడి చేయడంతో ఐదేళ్ల బాలుడి మృతి
- నేడు అన్ని పార్టీల కార్పొరేటర్లతో మేయర్ విజయలక్ష్మి భేటీ
- కుక్కల నివారణకు కమిటీ వేయాలని నిర్ణయం
బాలుడి కుటుంబానికి జీహెచ్ఎంసీ తరఫున రూ.8 లక్షలు ప్రకటించగా, కార్పొరేటర్లు తమ ఒక నెల వేతనంతో మరో రూ.2 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. అంతేకాకుండా, కుక్కల నివారణకు ఓ కమిటీ ఏర్పాటు చేయాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.