Ram Charan: మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే... సీడీపీతో సంబరాలు ప్రారంభించిన ఫ్యాన్స్

Ram Charan fans shares CDP for their hero birthday
  • ఆర్ఆర్ఆర్ తో రామ్ చరణ్ కు ప్రపంచవ్యాప్త ఆదరణ
  • హాలీవుడ్ లోనూ గుర్తింపు
  • చరణ్ పుట్టినరోజును మరింత చిరస్మరణీయం చేసేలా అభిమానుల కార్యాచరణ
  • ఆకట్టుకునేలా సీడీపీ విడుదల
ఆర్ఆర్ఆర్ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మార్చి 27న పుట్టినరోజు జరుపుకుంటున్నారు. హాలీవుడ్ లో రామ్ చరణ్ కు లభిస్తున్న ఆదరణ అభిమానులను ఆనందోత్సాహాల్లో ముంచెత్తుతోంది. ఇలాంటి తరుణంలో తమ ఆరాధ్య హీరో పుట్టినరోజు రావడంతో వారి సంతోషానికి అవధుల్లేకుండా పోతోంది. 

చరణ్ పుట్టినరోజుకు ఇంకా నాలుగు వారాల సమయం ఉన్నా, అభిమానులు ఇప్పటినుంచే సంబరాలకు తెరలేపారు. రామ్ చరణ్ చిత్రంతో సరికొత్త సీడీపీ (కామన్ డిస్ ప్లే పిక్చర్)ని సోషల్ మీడియాలో విడుదల చేశారు. మాస్ మార్చ్ (Mass MaRCH) పేరుతో మార్చి నెల అంతా తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలు జరిపేందుకు ఈ సీడీపీతో శ్రీకారం చుట్టారు. 

మార్చి నెలలో చివరి మూడు అక్షరాలు 'ఆర్ సీహెచ్' లను రామ్ చరణ్ అనే అర్థం వచ్చేలా పెద్దగా రాశారు. సీడీపీ చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది.
Ram Charan
Birthday
CDP
Fans

More Telugu News