Gudivada Amarnath: 14 రంగాలలో ఎంఓయూలు జరుగుతాయి: ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్

  • ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందన్న మంత్రి 
  • దేశ ఎగుమతుల్లో 8 శాతం ఏపీ నుంచి జరుగుతున్నాయని వెల్లడి 
  • 11 ఇండస్ట్రియల్ కారిడార్లలో 3 ఏపీలోనే ఉన్నాయన్న అమర్ నాథ్ 
Gudivada Amarnath on Global Investment Summit

గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ లో రాష్ట్రంలో ఉన్న వనరులు, సదుపాయాలు, మౌలిక వసతులను ఇన్వెస్టర్లకు వివరిస్తామని ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ తెలిపారు. పరిశ్రమకు సంబంధించిన ఎగ్జిబిషన్ ఉంటుందని చెప్పారు. అగ్రికల్చర్, హెల్త్, ఫార్మా, ఐటీ, టూరిజం తదితర రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తామని తెలిపారు. 14 రంగాల్లో ఎంఓయూలు జరుగుతాయని చెప్పారు. ఎంఓయూలను రెండు రోజుల పాటు జరుపుతామని అన్నారు.  
    
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ మూడేళ్లుగా నెంబర్ వన్ స్థానంలో ఉందని అమర్ నాథ్ చెప్పారు. దేశంలోని ఎగుమతులు 8 శాతం ఏపీ నుంచే జరుగుతున్నాయని తెలిపారు. దేశంలోని 11 ఇండస్ట్రియల్ కారిడార్లలో 3 ఏపీలోనే ఉన్నాయని చెప్పారు. 10 పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్లతో రాష్ట్రంలో పారశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ప్రతి పోర్టుకు అనుబంధంగా పోర్టు ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఎక్కువ ఉద్యోగాలను కల్పించే టెక్స్ టైల్ రంగంపై దృష్టి పెట్టామని తెలిపారు.

More Telugu News