Andhra Pradesh: ఏపీలో పెరుగుతున్న అమ్మాయిల సంఖ్య

Girl population increasing in Andhra Pradesh
  • 8 రాష్ట్రాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ
  • ఏపీలో వెయ్యి మంది అబ్బాయిలకు 1,021 మంది అమ్మాయిలు
  • తొలి స్థానంలో నిలిచిన కేరళ
మన దేశంలో 8 రాష్ట్రాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. ఈ జాబితాలో ఏపీ రెండో స్థానంలో ఉంది. తొలి స్థానంలో కేరళ ఉంది. ఈ వివరాలను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. 2021-22 గణాంకాల ప్రకారం ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు కేరళలో 1,114 మంది అమ్మాయిలు ఉండగా, ఏపీలో 1,046 మంది అమ్మాయిలు ఉన్నారు. జాతీయ స్థాయిలో 963 మంది అమ్మాయిలు ఉన్నారు. ఏపీలో 2019-20 ఏడాదిలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1,021 మంది అమ్మాయిలు ఉండగా... 2021-22 నాటికి ఆ సంఖ్య 1,046కి పెరిగింది. 

ఏపీలో మొత్తం 1,41,28,100 కుటుంబాలు ఉన్నాయి. వీటిలో పట్టణ ప్రాంతాల్లో 44,56,000 కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 96,72,100 కుటుంబాలు ఉన్నాయి. సగటు కుటుంబ పరిమాణం 3.3గా ఉండగా... పట్టణాల్లో ఇది 3.2గా, గ్రామీణ ప్రాంతాల్లో 3.4గా ఉంది. 

2021-22లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు అమ్మాయిలు అధికంగా ఉన్న రాష్ట్రాలు ఇవే:

  • కేరళ - 1,114
  • ఏపీ - 1,046
  • హిమాచల్ ప్రదేశ్ - 1,031
  • తమిళనాడు - 1,026
  • మేఘాలయ - 1,017
  • ఛత్తీస్ గఢ్ - 1,016
  • ఝార్ఖండ్ - 1,001
Andhra Pradesh
Girls Population

More Telugu News