OnePlus 11R: నేటి నుంచే వన్ ప్లస్ 11 ఆర్ 5జీ అమ్మకాలు

OnePlus 11R sale in India begins today Price offers availability and specifications
  • అమెజాన్ పై మొదలైన విక్రయాలు
  • క్రెడిట్ కార్డులపై రూ.1,000 డిస్కౌంట్
  • రెండు వేరియంట్లలో లభ్యం
  • 8జీబీ ర్యామ్ ధర రూ.39,999
  • 12జీబీ ర్యామ్ ధర 44,999
వినూత్న డిజైన్ తో ఎంతో ఆకర్షిస్తున్న వన్ ప్లస్ 11 ఆర్ 5జీ అమ్మకాలు నేటి నుంచి మొదలయ్యాయి. ఈ నెల 7న ఈ ఫోన్ విడుదల అయింది. అమెజాన్ తోపాటు ఆఫ్ లైన్ స్టోర్లలోనూ ఇది అందుబాటులో ఉంటుంది. రూ.1,000 తక్షణ డిస్కౌంట్ ను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

కస్టమర్లు 12 నెలల నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ను సైతం వినియోగించుకోవచ్చు. పాత వన్ ప్లస్ ఫోన్ల ఎక్స్ చేంజ్ పై రూ.3,000 బోనస్ ఇస్తోంది. అంటే ఎక్స్ చేంజ్ వ్యాల్యూకి ఈ బోనస్ అదనం. ఈ ఫోన్ రెండు వేరియంట్లుగా అందుబాటులోకి వచ్చింది. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ ధర రూ.39,999. 16 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ ధర రూ.44,999. గెలాక్టిక్ సిల్వర్, సోనిక్ బ్లాక్ రంగుల్లో లభిస్తాయి. 

స్నాప్ డ్రాగన్ 8ప్లస్ జెనరేషన్ 1 చిప్ సెట్, ఎల్పీ డీడీఆర్ 5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, 6.7 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, పంచ్ హోల్ డిజైన్ తో ఉంటుంది. స్క్రీన్ రీఫ్రెష్ రేటు 120 హెర్జ్ కాగా, 1450 నిట్స్ బ్రైట్ నెస్ ఇస్తుంది. ఫోన్ అంచులు కర్వ్ అయి ఉంటాయి. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ తో ఉంటుంది. ఫోన్ తోపాటు చార్జర్ కూడా బాక్స్ లో లభిస్తుంది.  వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ సోనీ ఐఎంఎక్స్ 890 సెన్సార్, 8 మెగా పిక్సల్ అల్ట్రావైడ్ కెమెరా, 2 మెగాపిక్సల్ మ్యాక్రో కెమెరా, ముందు భాగంలో 16 మెగాపిక్సల్ కెమెరా ఉంటాయి.
OnePlus 11R
5g phone
sales
amazon

More Telugu News