criketer marriage: ముంబైలో ఘనంగా శార్దూల్ ఠాకూర్ వివాహం

Shardul Thakur Married To Mittali Parulkar Rohit Sharma And Shreyas Iyer Attend Wedding
  • స్నేహితురాలినే పెళ్లాడిన క్రికెటర్
  • బంధువులు, సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం
  • పెళ్లి కారణంగా ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ కు దూరమైన శార్దూల్
టీమ్ ఇండియా ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ సోమవారం ఓ ఇంటివాడయ్యాడు. ముంబై వేదికగా తన స్నేహితురాలు, బిజినెస్ ఉమెన్ మిథాలీ పారుల్కర్ ను పెళ్లాడాడు. బంధువులు, స్నేహితులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యారు. ముంబైలో అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుక జరిగింది. క్రికెటర్ దీపక్ చాహర్ భార్య మాల్తీ చాహర్ కూడా వివాహ వేడుకలో కనిపించింది. కేకేఆర్ టీమ్ మేనేజ్‌మెంట్ సభ్యుడు అభిషేక్ నాయర్, ముంబై ప్లేయర్ సిద్ధేష్ లాడ్ కూడా శార్దూల్ ఠాకూర్ పెళ్లికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

మిథాలీ పారుల్కర్ ‘ది బేక్స్’ పేరుతో బేకరీ ఫుడ్ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఆల్ ది జాజ్ లగ్జరీ బేకర్స్ సంస్థ ద్వారా ముంబైలో వ్యాపారాలను నిర్వహిస్తోంది. కాగా, పెళ్లి కారణంగా శార్దూల్ ఠాకూర్ ఆస్ట్రేలియాతో టెస్ట్‌ సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే, ఆసీస్‌తో వన్డే సిరీస్ కు శార్దూల్ జట్టులో చేరతాడని సమాచారం.
criketer marriage
shardul thakur
mumbai
mithali parullkar
Team India player

More Telugu News