Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్, ఆయన భార్యకు ఢిల్లీ హైకోర్టు సమన్లు

  • యూపీఏ-1 హయాంలో రైల్వే మంత్రిగా ఉన్న లాలూ
  • భూములు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారంటూ సీబీఐ కేసు
  • ఇటీవలే కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న ఆర్జేడీ అధినేత
Delhi High Court sends summons to Lalu Yadav and his wife

భారత రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఐఆర్సీటీసీ కుంభకోణం ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ను వదలడం లేదు. ఇదే కేసులో తాజాగా ఆయనకు, ఆయన భార్య రబ్రీదేవికి ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. ఆయన కుమార్తె మీసా భారతితో పాటు మరో 11 మంది నిందితులకు కూడా సమన్లు పంపింది. మార్చి 15వ తేదీన విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొంది. 

కేసు వివరాల్లోకి వెళ్తే... ఇది యూపీఏ-1 ప్రభుత్వ హయాంలో చోటుచేసుకుంది. బీహార్ లోని అభ్యర్థుల నుంచి వ్యవసాయ భూములను తీసుకుని, వారికి రైల్వే శాఖలో ఉద్యోగాలను ఇప్పించారని వీరిపై సీబీఐ కేసు నమోదు చేసింది. మరోవైపు ఇటీవలే సింగపూర్ లో లాలూ ప్రసాద్ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారు. చికిత్స అనంతరం ఇండియాకు తిరిగి వచ్చిన ఆయనకు ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది.

More Telugu News