MLA Quota: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఇదిగో!

  • ఏపీలో 7, తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నికలు
  • షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం
  • మార్చి 23న పోలింగ్
  • అదే రోజున ఓట్ల లెక్కింపు
MLA quota MLC elections schedule for AP and Telangana announced

ఏపీ, తెలంగాణల్లో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం నెలకొని ఉంది. స్థానిక సంస్థలు, పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మార్చి 13న జరగనుండడం తెలిసిందే. ఈ క్రమంలో, తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నగారా కూడా మోగింది. 

ప్రస్తుతం ఏపీలో ఏడుగురు ఎమ్మెల్సీలు, తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. 

ఏపీలో టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ తో పాటు బచ్చుల అర్జునుడు, వైసీపీ నేతలు పోతుల సునీత, గంగుల ప్రభాకర్ రెడ్డి, చల్లా భగీరథరెడ్డి (గతేడాది మరణించారు), పెన్మత్స సూర్యనారాయణ, డొక్కా మాణిక్య వరప్రసాద్ ల పదవీకాలం ముగియనుంది. 

తెలంగాణలో ఎలిమినేటి కృష్ణారెడ్డి, నవీన్ రావు, గంగాధర్ రావుల పదవీకాలం ముగియనుంది. 

ఈ నేపథ్యంలో, ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. మార్చి 6న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మార్చి 14న నామినేషన్లు పరిశీలిస్తారు. మార్చి 23న పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజున ఓట్ల లెక్కింపు ఉంటుంది.

More Telugu News