MLC: ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణకు ముగిసిన గడువు... ఏపీలో ఏకగ్రీవమైన స్థానాలు ఇవే!

  • ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు
  • ఈ నెల 13న పోలింగ్
  • ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఏకగ్రీవం
  • వైసీపీ అభ్యర్థుల విజయకేతనం
MLC nominations with draw dead line ends in AP

ఏపీలో మార్చి 13న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇటీవల నామినేషన్లు దాఖలు కాగా, నామినేషన్ల ఉపసంహరణకు నేటితో గడువు ముగిసింది. ఈ క్రమంలో, ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇవన్నీ వైసీపీ బలపరిచిన అభ్యర్థులకే దక్కాయి.


విజేతల వివరాలు...
మేరుగ మురళీధర్- నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ
కె.సూర్యనారాయణ- తూర్పు గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ
రామసుబ్బారెడ్డి- కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ
డాక్టర్ సుబ్రహ్మణ్యం- చిత్తూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ
మంగమ్మ- అనంతపురం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ

ఐదు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో... మిగిలిన 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 13న పోలింగ్ నిర్వహించనున్నారు.

More Telugu News