Bairi Naresh: పోలీసుల వాహనంలో ఉండగానే.. బైరి నరేశ్ ను మరోసారి చితక్కొట్టిన అయ్యప్ప భక్తులు

Ayyappa devotees attacked Bairi Naresh
  • అయ్యప్ప స్వామిపై చులకన వ్యాఖ్యలు చేసిన నరేశ్
  • పోలీస్ వాహనం నుంచి లాగి దాడి చేసిన భక్తులు
  • గన్ లైసెన్స్ కావాలని డిమాండ్ చేసిన నరేశ్
కోట్లాది మంది హిందువుల ఆరాధ్యదైవం శబరిమల అయ్యప్పస్వామి. అయ్యప్ప మాలను ధరించి, ఎంతో నిష్టతో భక్తులు పూజలు నిర్వహిస్తుంటారు. అలాంటి అయ్యప్పస్వామిని చులకన చేసిన నాస్తికుడు బైరి నరేశ్ కు ఇప్పటికే అయ్యప్ప భక్తులు వీపు విమానం మోత మోగించారు. 

తాజాగా మరోసారి అతనిపై అయ్యప్పలు దాడి చేశారు. వరంగల్ జిల్లా హనుమకొండలోని గోపాల్ పూర్ ప్రాంతంలో అతనిపై దాడి జరిగింది. నరేశ్ ను అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాల నేతలు కొట్టారు. అయ్యప్ప స్వామిపై మరోసారి నరేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో, పోలీస్ వెహికల్ లో ప్రొటెక్షన్ తో వెళ్తున్న నరేశ్ ను భక్తులు కిందకు లాగి దాడి చేశారు. 

మరోవైపు దీనిపై నరేశ్ స్పందిస్తూ... తనపై దాడి చేస్తారనే పోలీసుల రక్షణను అడిగానని... పోలీసుల వాహనంలో ఉండగానే తనపై దాడి చేశారని చెప్పాడు. పోలీసుల వాహనంలో వెళ్తుంటే వెంబడించి దాడి చేశారని వాపోయాడు. తనకు గన్ లైసెన్స్ కావాలని కోరాడు.
Bairi Naresh
Ayyappa Swamy

More Telugu News