Pattabhi: గన్నవరం కేసులో టీడీపీ నేత పట్టాభి బెయిల్ పిటిషన్ పై విచారణ

Court takes up Pattabhi bail plea
  • ఇటీవల గన్నవరంలో ఉద్రిక్తతలు
  • పట్టాభి తదితరులపై సీఐ కనకరావు పోలీసులకు ఫిర్యాదు
  • తనను కులం పేరుతో దూషించారని ఆరోపణ
  • పట్టాభిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు

ఇటీవల గన్నవరంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ను పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. పట్టాభికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో, పట్టాభి న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన బెయిల్ పిటిషన్ పై విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు నేడు విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. 

కొన్నిరోజుల కిందట, గన్నవరంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో, పట్టాభి తదితర టీడీపీ నేతలపై సీఐ కనకరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను కులం పేరుతో దూషించారని ఆరోపించారు. దాంతో, పట్టాభి సహా 13 మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లతో కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News