Dharmapuri Srinivas: పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ కు అస్వస్థత.. ఎమ్మారై స్కానింగ్ చేస్తున్న వైద్యులు

D Srinivas admitted in hospital
  • డి.శ్రీనివాస్ కు ఫిట్స్ రావడంతో ఆసుపత్రికి తరలింపు
  • బంజారాహిల్స్ లోని సిటీన్యూరో ఆసుపత్రిలో చేర్పించిన కుటుంబసభ్యులు
  • ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స
ఉమ్మడి ఏపీలో పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించిన ధర్మపురి శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యారు. ఫిట్స్ రావడంతో ఆయనను కుటుంబసభ్యులు హుటాహుటిన బంజారాహిల్స్ లోని సిటీన్యూరో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు ఎమ్మారై స్కాన్ చేస్తున్నారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు వెల్లడించనున్నారు.

మరోవైపు, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఆయనను కేసీఆర్ రాజ్యసభకు పంపారు. అయితే టీఆర్ఎస్ లో ఆయన ఇమడలేకపోయారు. సొంత పార్టీ నుంచే ఆయనకు తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రస్తుతం ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో చురుకుగా లేకపోవడం గమనార్హం. ఆయన కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ ఎంపీగా ఉన్నారు.

Dharmapuri Srinivas
Hospital

More Telugu News