Naatu Naatu: ఇది ‘నాటు నాటు సమయం’..: నటుడు వెంకటేశ్

Venkatesh says Its Naatu Naatu time All the awards go to Ram Charan at a wedding in US Watch viral video
  • అమెరికాలో ఓ వివాహానికి హాజరైన చరణ్, వెంకటేష్
  • ఈ సందర్భంగా చరణ్ ను పరిచయం చేస్తూ ప్రశంసించిన వెంకటేశ్
  • ధన్యవాదాలు తెలియజేసిన చరణ్
నటుడు రామ్ చరణ్ తేజ్ ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి 20 రోజుల ముందే అమెరికా వెళ్లి తెగ హడావిడి చేసేస్తున్నాడు. ఎన్నో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. టీవీ ఇంటర్వ్యూలతో బిజీగా మారిపోయాడు. తన కుటుంబ సభ్యులతో కలసి ఓ వివాహానికి కూడా హాజరయ్యాడు. సరిగ్గా అదే వివాహ కార్యక్రమానికి నటుడు దగ్గుబాటి వెంకటేష్ కూడా విచ్చేశారు. దీంతో అక్కడి వాతావరణమే మారిపోయింది. 

నటుడు వెంకటేశ్ సరదాగా ఉండే వ్యక్తి. వివాహ వేడుకలో అతిథులకు హీరో రామ్ చరణ్ ను పరిచయం చేశారు. మైక్ తీసుకుని ‘‘మిస్టర్ చరణ్ ఇది నాటు నాటు సమయం అన్ని అవార్డులూ రామ్ చరణ్ కే’’అని ప్రకటించారు. రామ్ చరణ్ నవ్వు ఆపులేకపోయాడు. ఆర్ఆర్ఆర్ విజయానికి ఉప్పొంగిపోతూ వెంకీ నుంచి మైక్ తీసుకుని థ్యాంక్స్ వెంకీ అన్నా అని ప్రకటన చేశాడు. 

రాజమౌళి దర్శకత్వంలో, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రధారులుగా వచ్చిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వేదికలపై ప్రత్యేక గుర్తింపు, అవార్డులకు నోచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు ఎంపిక కాగా, ఇదే పాట ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఆస్కార్ అవార్డు నామినేషన్లలోనూ చోటు సంపాదించింది.
Naatu Naatu
Venkatesh
Ram Charan
USA
wedding

More Telugu News