preeti: సైఫ్ ను ఉరితీయాలంటూ విద్యార్థి సంఘాల ఆందోళన

Student Unionsprotest at kmc
  • వరంగల్ కేఎంసీ వద్ద విద్యార్థుల ధర్నా
  • మెడికల్ కళాశాలల బంద్‌కు పిలుపు
  • స్వగ్రామానికి ప్రీతి మృత దేహం
కాకతీయ మెడికల్‌ కళాశాలకు చెందిన పీజీ మొదటి సంవత్సరం విద్యార్థిని ధారావత్‌ ప్రీతి మరణంతో వరంగల్ లో కేఎంసీ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రీతికి న్యాయం చేయాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. నేడు తెలంగాణ వ్యాప్తంగా మెడికల్ కళాశాలల బంద్‌కు ఏబీవీపీతో పాటు ఓయూ జేఏసీ పిలుపునిచ్చాయి. ప్రీతిని వేదించి ఆమె ఆత్మహత్యకు కారణమైన సైఫ్‌ను ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. 

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో విద్యార్థులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. కాగా, ఐదు రోజులుగా హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన ప్రీతి ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఈ తెల్లవారుజామున గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తిచేసి  ప్రీతి మృతదేహాన్ని ఆమె స్వగ్రామం జనగామ జిల్లా కొడగండ్ల మండలం మొండ్రాయి గిర్ని తండాకి తరలించారు.
preeti
case
mediacal
KMC
STUDENT UNIONS

More Telugu News