Dr.Preethi: డాక్టర్ ప్రీతి మరణంపై పవన్ కల్యాణ్ స్పందన

  • అత్యతం బాధాకరమని వ్యాఖ్యానించిన జనసేన చీఫ్
  • ప్రీతి ఫిర్యాదుపై యాజమాన్యం సరిగ్గా స్పందించలేదని వ్యాఖ్య
  • అప్పుడే తగు చర్యలు తీసుకుంటే ప్రీతి చనిపోయేది కాదన్న పవన్ కల్యాణ్
Janasena Party President Pawan Kalyan Reacts On Doctor Preethi Death Issue

డాక్టర్ ప్రీతి మరణం అత్యంత బాధాకరమని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. ప్రీతి మరణంపై ఆయన దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కాలేజీ యాజమాన్యం సరిగ్గా స్పందించి, వేధింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని ఉంటే ప్రీతి తల్లిదండ్రులకు ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదన్నారు.

‘ఆసుపత్రిలో ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయిన డాక్టర్ ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ప్రీతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. సైఫ్ వేధింపులపై ఫిర్యాదు అందిన వెంటనే కాలేజీ యాజమాన్యం సరైన రీతిలో స్పందించి ఉంటే ప్రీతి చనిపోయేది కాదు. ఆమె మరణానికి కారణమైన వ్యక్తికి కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలి’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక డాక్టర్ ప్రీతి బలవన్మరణానికి పాల్పడ్డ పరిస్థితులు, ప్రీతి తల్లిదండ్రుల వేదన గురించి తెలిశాక హృదయం ద్రవించింది. కళాశాలల్లో ముఖ్యంగా మెడికల్‌, ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ర్యాగింగ్‌ ను నిరోధించాలి.. సీనియర్ల వేధింపులు అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

More Telugu News