Haryana: వీడిన మృతదేహాల మిస్టరీ.. వారిద్దరూ కిడ్నాపైన ముస్లింలే!

Burnt Bodies Found In Haryana SUV Of 2 Kidnapped Muslim Men
  • హర్యానాలో కిడ్నాపైన రాజస్థాన్ ముస్లింలు
  • ఈ నెల 16న జింద్‌లో ఓ గోశాల వద్ద కారులో కాలిన స్థితిలో మృతదేహాలు
  • హర్యానా పోలీసులతో కలిసి నిందితుల కోసం గాలిస్తున్న రాజస్థాన్ పోలీసులు
హర్యానాలోని జింద్‌లో ఈ నెల 16న ఓ గోశాల వద్ద కారులో కాలిన స్థితిలో కనిపించిన మృతదేహాల మిస్టరీ వీడింది. తాజాగా వీటికి సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక పోలీసులకు అందింది. చనిపోయిన ఇద్దరూ కిడ్నాప్‌కు గురైన రాజస్థాన్ వాసులు జునైద్, నసీర్‌గా గుర్తించారు. బజరంగ్ దళ్ సభ్యులే వారిని కిడ్నాప్ చేసి ఆపై హత్య చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

కాలిన మృతదేహాల నుంచి సేకరించిన నమూనాలు, బాధిత కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన నమూనాలు సరిపోలినట్టు భరత్‌పూర్ రేంజ్ ఐజీ గౌరవ్ శ్రీవాస్తవ్ తెలిపారు. నసీర్, జునైద్ కిడ్నాప్ తర్వాత దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారిని కిడ్నాప్ చేసిన ఎస్‌యూవీని జింద్‌లో గుర్తించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, హర్యానా పోలీసులతో కలిసి పనిచేస్తున్నట్టు ఆయన వివరించారు.
Haryana
Rajasthan
Kidnap
Jind
Crime News

More Telugu News