Andhra Pradesh: వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించాడని.. కర్రతో తండ్రిని చావబాదుతూ ప్రియరాలితో కొడుకు వీడియోకాల్!

Son Attacked Father while video call to girlfriend
  • చిత్తూరులో ఘటన
  • తనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోపంతో రగిలిపోయిన కొడుకు
  • తండ్రిపై దాడి చేయబోతున్నానని, దానిని చూడాలంటూ ప్రియురాలికి వీడియో కాల్
  • కుమారుడి దాడిలో తీవ్రంగా గాయపడిన తండ్రి
సన్మార్గంలో నడవాలని కుమారుడిని హెచ్చరించి పోలీసులకు ఫిర్యాదు చేయడమే ఆ తండ్రి చేసిన నేరమైంది. కన్న తండ్రిపై కక్ష పెంచుకున్న కుమారుడు క్రూరంగా ప్రవర్తించాడు. తండ్రిపై కర్రతో దాడిచేస్తూ ఆ దృశ్యాలను ప్రియురాలికి వీడియో కాల్‌లో చూపిస్తూ వికృతానందం పొందాడు. చిత్తూరులో నిన్న సాయంత్రం జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా హోంగార్డుగా పనిచేసే ఢిల్లీబాబు కుమారుడు భరత్ (21) కూలి పనులు చేస్తుంటాడు. 

భరత్ ఇటీవల 39 ఏళ్ల స్థానిక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసిన తండ్రి కుమారుడిని మందలించాడు. అంతటితో ఆగకుండా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు భరత్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి మందలించారు. తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రిపై కక్షపెంచుకున్న భరత్ నిన్న సాయంత్రం ప్రియురాలికి వీడియో కాల్ చేసి తన తండ్రిపై దాడి చేయబోతున్నానని, దానిని చూడాలని చెబుతూ.. కర్రతో తండ్రి తలపై బలంగా బాదాడు. దీంతో తలపగలి తీవ్ర రక్తస్రావమైంది. గమనించిన స్థానికులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Andhra Pradesh
Chittoor
Crime News

More Telugu News